Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

సామాన్యుడికి అందనంత దూరంలో కూరగాయల ధరలు

సామాన్యుడికి అందనంత దూరంలో కూరగాయల ధరలు
పెరిగిన కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలి
– డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి జగన్

రంగారెడ్డి జిల్లా బ్యూరో ,(మన సాక్షి):
పెరిగిన కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో కూరగాయల దుకాణాల్లో బిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి జగన్ మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు కూరగాయల ధరలు ఆకాశానంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

 

గ్యాస్, వంటనూనె, పప్పులు, అల్లం వెల్లుల్లి, ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్యుడు పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. ఈ పెరిగిన ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం తమకేమీ పెట్టనట్లు నిమ్మను నీరెత్తినట్లు వ్యవహరించటం సిగ్గుచేటు. నిత్యం ఇంట్లో వాడుకునే టమాటా, పచ్చిమిర్చి రేట్లు దడ పుట్టిస్తున్నాయి.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

 

1. Flipkart | నిరుద్యోగులకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ సహకారం.. రూ. 10 లక్షలు సంపాదించే ఛాన్స్..!

2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

3. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

4. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!

 

పెరిగిన ధరలతో ఏది కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. రోజంతా కష్టపడి పనిచేసిన డబ్బంతా కూరగాయలకే సరిపోవటం లేదని, ఇంకా కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేసి దళారులు ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు

 

రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు దళారులు మాత్రం లాభాలు గడిస్తున్నారని విమర్శించారు.తెలంగాణలో కూడా తమిళనాడు తరహాలో రేషన్ షాపుల్లో తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చెనమోని రాఘవేందర్, జిల్లా కమిటీ సభ్యులు దేవరకొండ రమేష్, నాయకులు ఆదర్ల సాయి, బోడ యాదగిరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు