Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)
Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)
మనసాక్షి , హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. నిత్యం బిజీగా ఉండే అతను తన కళ్ళ ముందు రోడ్డు ప్రమాదం జరిగితే.. సాటి మనుషులను కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నం పలువురి ప్రశంసలు ఆదుకుంటుంది. రోడ్డు ప్రమాదంలో గాయాలైన వారిని చూసిన కేటీఆర్ చెల్లించి పోయారు. దగ్గరుండి వారిని తన కాన్వాయ్ లోని వాహనంలో హాస్పటల్ కు తరలించారు.
వివరాల ప్రకారం… ఆదివారం మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి హైదరాబాద్ కు సాయంత్రం బయలుదేరారు. కాగా మంత్రి కేటీఆర్ వెళ్తున్న దారిలోనే మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బస్సును ఢీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.
ALSO READ :
1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!
2. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!
3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!
4. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!
ఈ సమయంలో కేటీఆర్ కాన్వాయ్ అటువైపు వచ్చింది. గాయాలతో పడి ఉన్న వారిని చూసి చలించిపోయిన కేటీఆర్. కాన్వాయ్ ఆపి జతగాత్రులను పరామర్శించి వారిని వెంటనే తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో ఎక్కించి హాస్పిటల్ కి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు . ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది.
VIDEO :
మంత్రి @KTRBRS గారు ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు. pic.twitter.com/AgDdpFf55K
— KTR News (@KTR_News) July 16, 2023









