Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ ..!

Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ ..!

మనసాక్షి , హైదరాబాద్ :

గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు నీటి సరఫరా విభాగం అలర్ట్ ప్రకటించింది. గోదావరి మెయిన్ పైప్ లైన్ లీకేజీ రిపేర్లు చేపట్టనున్న కారణంగా.. జూలై 19, 20వ తేదీలలో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు వాటర్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈనెల 19వ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వాటర్ బోర్డు డివిజన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా.. మరికొన్ని ప్రాంతాలలో పూర్తిగా నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

 

బోరబండ, వెంకటగిరి, బంజరా హిల్స్ రిజర్వాయర్ల పరిధిలో, ఎర్రగడ్డ , అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసఫ్ గూడ, కెపిహెచ్ బి, మలేషియా టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు .. లింగంపల్లి నుంచి కొండాపూర్ గోపాల్ నగర్ , మయూరి నగర్, ప్రగతి నగర్ లోని కొన్ని ప్రాంతాలు.

 

ALSO READ : 

 

1. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

2. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

3. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

4. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

5. దుబ్బాక : అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక, బాలుడు మృతి

 

 

అదేవిధంగా నిజాంపేట్ ,బాచుపల్లి, కూకట్ పల్లి డివిజన్ ఎల్లమ్మబండ ,అల్వాల్ రిజర్వాయర్, కుతుబుల్లాపూర్, షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల ,జగద్గిరిగుట్ట, వాణి కెమికల్స్, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి పరిధిలోని సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ. కాప్రా మున్సిపాలిటీలోని సాయిబాబా నగర్ , రాధిక ,మహేష్ నగర్ రిజర్వాయర్ పరిధిలో నీటి సరఫరా ఉండదని తెలిపారు.

 

నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర , బొల్లారం, కొంపల్లి , గుండ్ల పోచంపల్లి, తూముకుంట, జవహర్ నగర్ , దేవరయాంజెల్, హకీంపేట, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ , ఆలేరు, షామీర్ పేట, మేడ్చల్, కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, తుర్కపల్లి బయోటెక్ పార్క్ ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. రెండు రోజులపాటు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు