ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య..!
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య..!
దుబ్బాక, మనసాక్షి :
చేసిన అప్పులు ఎక్కువై, ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజుతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భరత్ నగర్ కు చెందిన రంగారోళ్ళ శ్రీకాంత్(31) గత రెండు సంవత్సరాల క్రితం నుండి దుబ్బాకకు వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు.
ALSO READ :
- మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
- Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
గతంలో శ్రీకాంత్ సిద్దిపేటలో హోటల్ పెట్టి 10 లక్షల వరకు అప్పలపాలయ్యాడు. అట్టి అప్పులు తీర్చేందుకు ఇందిరమ్మ కాలనీలో ఉన్న ప్లాటును అమ్మి అప్పులు కట్టాడు. ప్రస్తుతం శ్రీకాంత్ కు పని లేక ఉన్నాడు.
ఇటు పని లేక, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై తాను కిరాయింటున్న బింగి రవీందర్(డిష్ ) ఇంట్లో ఉన్న దూలానికి చీర తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుఎస్సై తెలిపారు.









