మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం..!
మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం..!
కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, మాడ్గుల ప్రతినిధి,మనసాక్షి:
మహిళా సాధికారతనే లక్ష్యంగా పని చేస్తూ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.మాడ్గుల మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎంపీపీ గౌరవరం పద్మారెడ్టితో కలసి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందడుగు వేయాలన్నారు. వంటింటికే పరిమితం కాకుండా చైతన్యవంతం అయినప్పుడే సమాజంలో మార్పు వచ్చి ఇల్లు, ఊరు, గ్రామం, మండలం తద్వారా దేశం ఆర్థికాభివృద్ది సాధిస్తుందన్నారు.
ALSO READ :
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
- Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
గత 10నెలల నుండి విద్యా, వైద్యం, ఉపాధి కార్యక్రమాలు ప్రతీ గ్రామానికి తీసుకెళుతున్నామని, ఉపాధి లో భాగంగానే మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ ఉచిత కుట్టు మిషను శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామల, మాజీ ఎంపిపి అన్నేపాక జంగయ్య, యంపిటిసి సభ్యులు నారమ్మ బాలరాజు గౌడ్, సర్పంచ్ లు హంసి రాంలాల్, స్వప్న సురేష్, వెంకటమ్మ , జంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదిని జైపాల్ రెడ్డి, మోక్తాల కృష్ణయ్య గౌడ్, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- ఓట్లు మావే సీట్లు మాకే అంటూ.. భారీ బైక్ ర్యాలీతో గళమెత్తిన బీసీ నాయకులు..!
- నారాయణపేట : ఓటర్ జాబితా తప్పులు లేకుండా సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- వైకుంఠధామం బిల్లు ఇస్తారా.. చావమంటారా..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !










