వైకుంఠధామం బిల్లు ఇస్తారా.. చావమంటారా..!
వైకుంఠధామం బిల్లు ఇస్తారా.. చావమంటారా..!
అదే వైకుంఠధామంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం
నేలకొండపల్లి, మన సాక్షి.
రెండేళ్ల క్రితం నిర్మించిన వైకుంఠదామం నిర్మాణం కు సంబంధించిన బిల్లు చెల్లించటం లేదని.. సదరు కాంట్రాక్టర్ పురుగుల మందు డబ్బా పట్టుకుని వైకుంఠదామం వద్ద నిరసన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని గువ్వలగూడెం. గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ.11.60 లక్షలతో వైకుంఠదామం ను రెండేళ్ల క్రితం నిర్మించారు.
ఆ సమయంలో రేకుల షెడ్ నిర్మాణం మంజూరు కాగా.. అప్పటి అధికారులు భవనం నిర్మించాలని కాంట్రాక్టర్ మన్నెపల్లి రవి ని అధికారుల ఒత్తిడి చేశారు. ఈ మేరకు భవనం ను నిర్మించారు. దీనికి గాను అదనంగా రూ.6 లక్షలు ఖర్చు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన యం.బి.రికార్డులు కనిపించకపోవటంతో బిల్లు చెలింపులో జాప్యం జరిగింది.
ALSO READ :
- Congress : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
అప్పటి నుంచి బిలు కోసం కార్యాలయంచుట్టూ తిరిగినా పట్టించుకోకపోవటంతో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వైకుంఠదామం వద్ద పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని కూర్చున్నారు. విషయం తెలిసిన సంబంధిత అధికారులు ఎంపీడీఓ కె. జమలారెడ్డి, మండల పంచాయతీ అధికారి శివ లు ఘటనా స్థలం కు చేరుకుని రవి తో చర్చించారు.
త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఇది ఇలా ఉండగా ఈ సమస్య ను మరో 15 రోజుల్లో పరిష్కరించకుంటే కుటుంబం తో సహా అదే వైకుంఠదామం వద్ద ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు రవి తెలిపారు.
MOST READ :
- Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
- Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)









