Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసిద్దిపేట జిల్లా

Revenue Division : రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతపై కరపత్ర ఆవిష్కరణ..!

Revenue Division : రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతపై కరపత్ర ఆవిష్కరణ..!
దుబ్బాక, మనసాక్షి :
నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు గన్నె బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

నియోజకవర్గ స్థాయిలో అన్ని కార్యాలయాలు ఉన్న దుబ్బాకను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అన్ని అర్హతలు, డివిజన్ ఏర్పాటు వలన ఏర్పాటు కాబోయే కార్యాలయాలు వంటి అన్ని వివరాలతో కూడిన కరపత్రాన్ని దుబ్బాక రెవెన్యూ డివిజన్ జే ఎ సి ఆధ్వర్యంలో ఇంటింటికి, షాపులకు పంపిణీ చేస్తారన్నారు.

ALSO READ : 

1. Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!

2. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

3. పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి..!

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వలన అన్ని రకాల డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు అయి దుబ్బాక నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎన్నికల లోపే దుబ్బాక రెవెన్యూ డివిజన్ మంజూరు కోసం క్రుషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక రెవెన్యూ డివిజన్ జే ఎ సి ప్రతినిధులు రేపాక భాను, చింత సంతోష్, రాజేశ్, కడవేర్గు రాజేందర్, నాగరాజు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు