Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Anganwadi Strike : అంగన్ వాడిల సమ్మె.. కాంగ్రెస్ మద్దతు..!

Anganwadi Strike : అంగన్ వాడిల సమ్మె.. కాంగ్రెస్ మద్దతు..!

సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడిన కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ , మన సాక్షి :

అంగన్వాడీ ఉద్యోగులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం నిరవధిక సమ్మెలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వారికి మద్దతు తెలియడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన కనీస వేతనం పర్మినెంట్ చేయాలన్నారు. వారికి ప్రమాద భీమ కల్పించడం వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనియెడల అంగన్వాడి ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ , బి ఎల్ అర్ బ్రదర్స్ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు.

ALSO READ : 

  1. SURYAPET : పేగు బంధాన్ని కంప చెట్లలో పడేసిన కసాయి తల్లి..!
  2. సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
  3. Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
  4. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

అదే విధంగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజుల వరకు మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యం బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వారికి అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు ,సిఐటియు నాయకులు మల్లు గౌతంరెడ్డి , ఏఐటీయూసీ నాయకులు సయిద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్, డిసిసి ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, మస్తాన్ నాగరాజు , ఫయుం, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు