విజయభేరి సభను జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటుదాం
విజయభేరి సభను జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటుదాం
టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబిసి డిక్లరేషన్ కమిటీ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి, (మన సాక్షి):
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గక అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన తల్లి సోనియాగాంధీ మాత్రమేనని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబిసి డిక్లరేషన్ కమిటీ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
సెప్టెంబర్ 17న తుక్కుగూడలో టిపిసిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయభేరి సభ సన్నాహక సమావేశం బుధవారం బోడుప్పల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబిసి డిక్లరేషన్ కమిటీ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్ర శేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలోని నిధులు రాష్ట్రంలోనే ఖర్చవుతాయని ఆశించిన తెలంగాణ యువత తొమ్మిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో మోసానికే గురయ్యారే తప్ప ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపాన టిఆర్ఎస్ పోలేదన్నారు.
సెప్టెంబర్ 17న నిర్వహించే విజయభేరి సభకై తెలంగాణకు విచ్చేయుచున్న సోనియాగాంధీ , ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కర్గే, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ALSO READ : ఎన్నికలు దగ్గర పడగానే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి స్టంట్లు చేస్తది
ఈ కార్యక్రమం లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కరదర్శి పొన్నం తరుణ్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, హైదరాబాద్ జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వరలక్ష్మి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుర్రి మహేష్, సీనియర్ నాయుకులు మధుసూదన్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, రాపోలు శంకరయ్య, వెంకటేష్ గుప్త, సింగిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పోగుల వీర రెడ్డి, దొంతి లింగం, మేకల యాదగిరి, కుర్రి శంకర్, హరినాథ్ రెడ్డి,
ALSO READ : Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
పోగుల దిలీప్ రెడ్డి, గీత రెడ్డి, తోటకూర రాజు యాదవ్, తోటకూర మల్లేష్ యాదవ్, జ్ఞానేశ్వర్, రాపోలు ఉపేందర్, సింగిరెడ్డి రాజు రెడ్డి, విశ్వం గుప్త,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరప్ప, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ s.c సెల్ అధ్యక్షులు నవీన్, రాపోలు రామస్వామి,ఏ రాములు, తోటకూర రాహుల్ యాదవ్, ఉప్పు గళ్ళ ప్రశాంత్, గణేష్ నాయక్, అఫ్జల్ , మురళి నాయక్, హరి కృష్ణ గౌడ్, సూరి, తదితరులు పాల్గొన్నారు.









