Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

కాంగ్రెస్ ప్రకటించిన హమీలను రాష్ట్ర ప్రజలు నమ్మరు..!

కాంగ్రెస్ ప్రకటించిన హమీలను రాష్ట్ర ప్రజలు నమ్మరు..!

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

మాడ్గుల ,  మనసాక్షి:

కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన అమలుకు సాధ్యం కాని హమీలను రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మాడ్గుల మండలంలోని నాగిళ్ళ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 60 మంది గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

పార్టీ లో చేరిన వారికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందాలన్న కుయుక్తులతో ఎన్నికల ముందు ప్రకటించిన హమీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు హర్షించడం లేదన్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

అందుకే కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేక బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి,

సర్పంచ్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురమల్ల సత్తయ్య, రైతుసమితి అధ్యక్షులు పాలకూర్ల రాజుగౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సురమల్ల చెన్నయ్య, బండ నర్సింహ్మ, యువ నాయకులు నాగిళ్ళ మహేశ్, బన్నె వరుణ్, మహేష్ గౌడ్,డి.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్..!

మరిన్ని వార్తలు