MIRYALAGUDA : 27న మిర్యాలగూడ జిల్లా బంద్.. విజయవంతం చేయాలి..!
MIRYALAGUDA : 27న మిర్యాలగూడ జిల్లా బంద్.. విజయవంతం చేయాలి..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
27న జరిగే మిర్యాలగూడ జిల్లా బంద్ ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా ఏర్పాటే ఏకైక లక్ష్యంతో బంద్ కు పిలుపు ఇచ్చామని వ్యాపార, వాణిజ్య వర్గాలు మద్దతు పలకాలని కోరారు.
పాలకపక్షాలు స్పందించాలని, వెంటనే జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.బంద్ కు విద్య సంస్థలు, రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, విద్యార్ది, యువజన మహిళ కుల సంఘాలు మద్దతు పలకాలని కోరారు.
సమావేశంలో నీల మోహన్ రావు, ఎంపీటీసీ సైదులు, కోల సైదులు,డాక్టర్ రాజు, కళాకారుడు దారం మల్లేష్ యాదవ్, దశరథ్ నాయక్, దుర్గాప్రసాద్,కోటయ్య, జయరాజు, కొత్తపల్లి సైదులు, పోగుల సైదులు గౌడ్,రజక సంఘం అధ్యక్షులు దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :









