Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైంతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లాహైదరాబాద్

Fake Certificates : బోగస్ సర్టిఫికెట్లతో ఎంబిబిఎస్ సీట్లు.. వెరిఫికేషన్ లో ట్విస్ట్..!

Fake Certificates : బోగస్ సర్టిఫికెట్లతో ఎంబిబిఎస్ సీట్లు.. వెరిఫికేషన్ లో ట్విస్ట్..!

హైదరాబాద్/ వరంగల్ మన సాక్షి :

నకిలీ సర్టిఫికెట్ల దండ బయటపడింది. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఏకంగా ఎంబిబిఎస్ సీట్లనే కొట్టేశారు ఆ విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లతో ఎంబిబిఎస్ సీట్లు కొట్టేశారు. ఈ దందాకు సూత్రధారి కన్సల్టెంట్ నిర్వాహకుడు కామిరెడ్డి నాగేశ్వరరావు పై వరంగల్ లో మెట్టవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

వివరాల ప్రకారం బోగస్ సర్టిఫికెట్లతో ఎంబిబిఎస్ సీట్లను ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థుల ప్రవేశాలను కాలోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం రద్దు చేసింది. అక్రమంగా సీట్లు పొందిన ఏపీకి చెందిన ఏడుగురు విద్యార్థులతో పాటు సూత్రధారిపై కేసు నమోదు అయింది. కాళోజి యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ సంధ్య ఫిర్యాదు మేరకు మెట్టవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Congress Party : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు మరో కొత్త పథకం.. విద్యార్థులకు..!

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుబ్రహ్మణ్య తేజ, వాణి పెంట సాయి ప్రీతిక రెడ్డి, తమ్మినేని విష్ణు తేజ రెడ్డి, తన్నీరు సంజయ్, అరికట్ల హనుమాన్ రెడ్డి, టేకులపల్లి మహేష్, గొర్లె భార్గవ్ ధర్మతేజ యశ్వంత్ నాయుడు లను పోలీసులు విచారణ చేస్తున్నారు.

2023 24 విద్యా సంవత్సరానికి గాను ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలకు కాళోజి యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా ఎంబిబిఎస్ సీట్లు పొందిన ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలపై యూనివర్సిటీ అధికారులకు అనుమానం కలిగింది. ఈ ఏడుగురు 9వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్లు సర్టిఫికెట్లలో పేర్కొన్నారు.

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. స్థానిక కోటాలో సీట్లు పొందారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ లో చదివారు . నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాయడంతో అధికారులకు అనుమానం వచ్చింది. సర్టిఫికెట్లతో ప్రత్యక్షంగా యూనివర్సిటీకి రావాలని విద్యార్థులను కోరారు.

వారు పొంతలనేవి సమాధానాలు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. విజయవాడలోని ఒక ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండానే సర్టిఫికెట్లు పొందుపరిచారని అధికారులకు ఆ విద్యార్థులు తెలిపారు. దాంతో ఈ సర్టిఫికెట్లన్నీ నకిలీవని తేల్చి వీరి ప్రవేశాలను రద్దు చేసింది.

ఈ దందాకు సూత్రధారణ నాగేశ్వరరావు తో పాటు ఏడుగురు విద్యార్థులపై యూనివర్సిటీ రిజిస్టర్ సంధ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Komati Reddy Press Meet : తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ.. తెలంగాణ పేరు మార్చుకున్న పార్టీ .. ఆ పార్టీ కథ ముగిసినట్లే..!

మరిన్ని వార్తలు