Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda Brs : నల్లగొండ బీఆర్ఎస్ లో ముసలం.. పిల్లి రామరాజు యాదవ్ సస్పెన్షన్..!

Nalgonda Brs : నల్లగొండ బీఆర్ఎస్ లో ముసలం.. పిల్లి రామరాజు యాదవ్ సస్పెన్షన్..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీ నుంచి పిల్లి రామరాజు యాదవ్ ను సస్పెన్షన్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి స్థానిక ఎనిమిదో వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజును సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. రాష్ట్ర కార్యదర్శులు చా డా కిషన్ రెడ్డి, నిరంజన్ వలి లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు .

టిఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా పిల్లి రామరాజు పార్టీ వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు.

ఇకనుండి ఆయన జరిపే సభలు సమావేశాలకు ఇతర రాజకీయ సంబంధాలకు టిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని. కార్యకర్తలు కూడా హాజరు కావద్దని కోరారు.

ALSO READ : Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు