Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

C Whistle : అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌.. వంద నిమిషాల్లోనే పరిష్కారం..!

C Whistle : అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌.. వంద నిమిషాల్లోనే పరిష్కారం..!

– సాంకేతికత దన్నుగా కోడ్ ఉల్లంఘనలపై నిఘా

నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్
నల్లగొండ, మన సాక్షి :
అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగస్తోంది అని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్నల్ తెలిపారు .

ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చునని.ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చునన్నారు.

ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

ALSO READ : Brs B form : 51 మందికే బీఆర్ఎస్ బీఫామ్ లు.. కవితకు బీఫామ్ అందజేసిన కేసిఆర్, షాక్..!

ఈ యాప్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చనని. ఈ యాప్‌ను ఇప్పటికే కొన్ని లక్షల మంది పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని.

ఈ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారురని ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నది అని తెలిపారు

వంద నిమిషాల్లోనే పరిష్కారం : 

స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి సీ-విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందులో వివరానుల నమోదు చేసుకోవాలి. ఎక్కడైతే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియో తీసి దాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఇలాంటి కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్‌లోడ్‌ చేయొచ్చు.

ALSO READ : Congress First List : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఇవీ పేర్లు..!

సీ-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు పూనుకుంటుంది. యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్‌ నంబర్లను ఈసీ గోప్యంగా ఉంచుతుంది.

వేగంగా చర్యలు. తీసుకుంటాం : 

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే విధానంపై ప్రజలకు, అధికార యంత్రాగం అవగాహన కల్పిస్తుంది. ఈ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అక్రమాలపై సీ-విజిల్‌ యాప్‌తోపాటు 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు నని కలెక్టర్ తెలిపారు.

ALSO READ : Kcr Twist : కెసిఆర్ బిగ్ ట్విస్ట్.. బీ ఫామ్ లు వారికేనా, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..!

మరిన్ని వార్తలు