Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

ప్రాణం తీసిన కురుకురే ఫ్యాకెట్..!

ప్రాణం తీసిన కురుకురే ఫ్యాకెట్..!

నీటి తొట్టిలో పడి బాలుడు మృతి

నేలకొండపల్లి, మన సాక్షి:

ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా. ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా గ్రామానికి చెందిన గుగులోత్ సురేష్-స్వప్న లకు చెందిన సుశాత్లామ్(4) సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు.

తల్లి ఇంట్లో పని చేసుకుంటుంది. కాగా తన కోసం తెచ్చిన కురుకురే ప్యాకెట్ గాలికి వెళ్లి నీటి తొట్టిలో పడింది. ఇది గమనించిన బాలుడు ఆ ఫ్యాకెట్ కోసం నీటి తొట్టి లోకి వంగి తీసుకోబోయాడు. ప్రమాదవశాత్తు తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తల్లి కుమారుడు ను చూసి బోరున విలపించింది. బాలుడు మృతదేహం ను చూసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ALSO READ : BIG BREAKING : సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహం..!

మరిన్ని వార్తలు