Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

అడుగడుగునా.. హారతులతో బిఎల్ఆర్ కు నీరాజనాలు..!

అడుగడుగునా.. హారతులతో బిఎల్ఆర్ కు నీరాజనాలు..!

అడవిదేవులపల్లి , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఎన్నికల ప్రచారంలో భాగంగా అడవిదేవులపల్లి మండలంలోని దుద్య తండ, వస్రం తండా, చంప్ల తండా, గోనియా తండా, బంజారా తండా, ఇంద్రనగర్, గాంధీనగర్, చింత చెట్టు తండా, బంగారిగడ్డ, ఉల్సాయి పాలెం, నల్ల మిట్ట తండా, సారెగూడెం, నడిగడ్డ, జీలకర్ర కుంట తండా గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్అర్ మాట్లాడుతూ గిరిజన ప్రజలు ఆరతులు ఇస్తూ నీరాజనాలు పట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాకు గిరిజన ఆడపడుచులకు అన్నా చెల్లెలి అనుబంధం ఉందని, ఇలాంటి ప్రేమ అనురాగాలు దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని,పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తామన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!

  • మహాలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
  • 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,
  • చేయూత నెలసరి పింఛన్ 4వేల రూపాయలు,
  • 10 లక్షల రాజీవ్ బీమా, రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా 15 వేల రూపాయలు,
  • కౌలు రైతులకు 12 వేల రూపాయలు,
  • వ్యవసాయ కూలీలకు వరి పంటకు 500 రూపాయల బోనస్,
  • గృహజ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్,
  • ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు,
  • ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం,
  • యువ వికాస్ ద్వారా విద్యార్థులకు 5 లక్షలు,
  • విద్య భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!

అంతేకాకుండా నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మస్తు కిట్టుతో పాటు తాళిబొట్టు నా సొంత ఆడపడుచు లాగా భావించి నా ఇంటి నుంచి బట్టలు అందిస్తానని అన్నారు.30వ తేదీన జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, మండల పార్టీ ప్రెసిడెంట్ బాలు నాయక్, మండల నాయకులు బండి నాగేశ్వరరావు, గోపగాని హనుమంతు, గుండా శ్రీనివాస్, పెద్దింటి వెంకటేశ్వర్లు, కలకొండ హరీష్,కలకొండ బిక్షం, కొట్ర వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి : 

మరిన్ని వార్తలు