Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరిక..!

మిర్యాలగూడ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరిక..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ ధీరావత్ భారతీ రాగ్యా నాయక్, ఆమె కుమారుడు స్కైలాబ్ నాయక్ సొంతగూటికి చేరారు. హైదరాబాదులోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన స్కైలాబ్ నాయక్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 14 వేల ఓట్లు సాధించారు. అనంతర పరిణామాల వల్ల స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

ఆ తర్వాత కొంతకాలంగా ఆయన బిఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు దామరచర్ల ఎంపీపీ నందిని రవితేజ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ : అడుగడుగునా.. హారతులతో బిఎల్ఆర్ కు నీరాజనాలు..!

అదేవిధంగా దామరచర్ల మండలం బండవత్ తండా సర్పంచ్ తో పాటు మరో ఐదుగురు మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ,  పీసీసీ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు