Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESviralఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణ

39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!

39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!

మన సాక్షి వెబ్ డేస్ :

ఇటీవల కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ గా అయిపోయింది. భాగస్వామితో చిన్న గొడవ వచ్చిన విడాకులు తీసుకొని మరో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకొని.. అందరిని ఒకే ఇంట్లో కాపురం పెట్టాడంట.

పూర్తి వివరాలు ప్రకారం.. మిజోరంలోని భాక్తవాంగు గ్రామంలో జోయినా చన మొత్తం 39 మందిని పెళ్లి చేసుకుని ఒకే భవనంలో నాలుగు అంతస్తులలో వంద గదులు నిర్మించి కాపురం పెట్టాడు.

అతనికి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తొలిసారిగా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో పది మందిని వివాహం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అలా తాను చనిపోయే వరకు మొత్తం 39 మందిని భార్యలను పెళ్లి చేసుకున్నాడు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. సొంతగూటికి చేరిన అలుగుబెల్లి, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక..!

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నజోయినా 2021లో మృతి చెందాడు. ఆయనకు 94 మంది పిల్లలు, 47 మంది గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారు. మొత్తం భార్యలు,  పిల్లలు, మనవరాలు, తన సొంత గ్రామంలోని నాలుగు అంతస్తుల భవనంలో 100 గదులలో 108 మంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట నివాసం ఉండేలా చేశాడు.

అందరూ ఉమ్మడిగానే మొత్తం 180 మంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉమ్మడిగానే ఉంటున్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ఈ భవనం పర్యాటకులకు టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఇక జోయినా తన బెడ్ రూమ్ కు పక్కనే డార్మెటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ డార్మెటరీ లోనే భార్యలు ఉండేవారు ఎల్లప్పుడూ తన వద్ద ఏడు నుంచి ఎనిమిది మంది భార్యలు ఉండేలా ప్లాన్ చేసుకునేవారని స్థానికులు పేర్కొంటున్నారు.

అందరూ కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా పేర్కొనవచ్చును. ఈ విషయం నిన్న కొందరు షాక్ అవుతున్నారు. అంతమంది భార్యలతో ఎలా ఉన్నాడు అని కొంతమంది చర్చించుకుంటున్నారు.

ALSO READ : నల్గొండ, గద్వాల, వరంగల్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన..!

మరిన్ని వార్తలు