మిర్యాలగూడ : ఆవాస భరోసా.. సొంత ఖర్చులతో సర్పంచ్ వెంకటరమణ చౌదరి నూతన పథకం..!
మిర్యాలగూడ : ఆవాస భరోసా.. సొంత ఖర్చులతో సర్పంచ్ వెంకటరమణ చౌదరి నూతన పథకం..!
భోగవిల్లి సునీత మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
మిర్యాలగూడ రూరల్, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లో సర్పంచ్ భోగవిళ్లి వెంకటరమణ చౌదరి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ గ్రామంలో సర్పంచ్ భోగవిల్లి వెంకటరమణ చౌదరి తన భార్య జ్ఞాపకర్ధం “భోగవిల్లి సునీత మెమోరియల్ ఫౌండేషన్” ను ప్రారంభించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇల్లు లేక కిరాయి ఇళ్లల్లో ఉంటున్న పేదల కోసం ఆవాస భరోసా అనే పధకం ప్రారంభించారు.
ALSO READ : BREAKING : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ.. బిజీ, సీనియర్లకు ఆహ్వానం..!
25 ఇల్లు లేని పేద కుటుంబాలకు ప్రతి నెల 1000 రూపాయలు అందించే విధంగా ఆవాస భరోసా కార్డ్ లు , ఈ నెల కు సంబందించిన మొత్తం అందించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ , ఫౌండేషన్ చైర్మన్ భోగవిల్లి వెంకటరమణ చౌదరి తెలియజేశారు.
ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!










