Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Free Travel : 9 నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇవి రూల్స్..!

Free Travel : 9 నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇవి రూల్స్..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది.  ముఖ్యమంత్రిగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కూడా ప్రమాణస్వీకారం రోజే తొలి సంతకం పెట్టే శారు. వాటిలో మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన గ్యారెంటీలలో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంది. దానిపై కూడా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. కాగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. కానీ అక్కడ కేవలం అర్బన్ ప్రాంతాలలో సిటీ బస్సులలోనే మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

ALSO READ : Revanth Reddy : సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. మారిన ముహూర్తం..!

అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కర్ణాటకలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కర్ణాటకలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పై సంతకం పెట్టే శారు. అందుకుగాను ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ఎలా ఉందనే విషయంపై తెలంగాణకు సంబంధించిన నలుగురు ఆర్టీసీ అధికారులు ఆ రాష్ట్రం వెళ్లి పరిశీలించారు. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ తో పాటు అర్బన్ బస్సులు కూడా నడుపుతున్నారు.

ప్రస్తుతం అన్ని బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే ఏడాదికి 2200 కోట్ల రూపాయలు ఖర్చుకానున్నదని అంచనా వేశారు. కేవలం పేదలు ఎక్కువగా ప్రయాణం చేసే పల్లెవెలుగు బస్సులలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే కేవలం 730 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు.

ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

మహిళలు పల్లె వెలుగు  ఎక్స్‌ప్రెస్  బస్సులతోపాటు అర్బన్ ఏరియాలలో సిటీ బస్సు లలో చితంగా ప్రయాణం చేస్తే అవకాశం కల్పించారు. మహిళలు ఆధార్ కార్డు గాని ఇతర ఏదైనా కార్డు చూపిస్తే సరిపోతుంది. వారికి జీరో టికెట్టు బస్సులో ఇవ్వమన్నారు. దాని ప్రకారం ఎంతమంది ప్రయాణించారనే విషయం లెక్క తేలనున్నది. మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో..? ఆ లెక్కల ప్రకారం ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకని ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  కాగా ప్రభుత్వ నిర్ణయం మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

మరిన్ని వార్తలు