Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Telangana : తెలంగాణ సీఎం గా రేవంత్.. మంత్రుల ప్రమాణ స్వీకారం..!

Telangana : తెలంగాణ సీఎం గా రేవంత్.. మంత్రుల ప్రమాణ స్వీకారం..!

ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినట్లుగా ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో భారీ జన సందోహం మధ్య రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

ముందుగా తాజ్ కృష్ణ హోటల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ లతో రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం కు చేరుకున్నారు. వారికి ఎల్ బి స్టేడియం వద్ద భారీగా ఘన స్వాగతం పలికారు.

ALSO READ : Free Travel : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లు.. ఇవి రూల్స్..!

ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. వీరితోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ , తెలంగాణ పార్టీ వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలంతా రావాలని రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు స్వాగతం పలకడంతో పాటు వారికి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 25వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బయట ఉండే వారు కూడా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

ALSO READ : ప్రజల మధ్యలో నేడు రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం.. మంత్రులు వీరే..!

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే :

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తో పాటు పలువురు మంత్రులు కూడా ఆయనతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క , మంత్రులుగా సీతక్క, ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

మరిన్ని వార్తలు