Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Telangana : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

Telangana : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీ స్కీములపై తొలి సంతకం పెట్టారు.

వాటిని వంద రోజులలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు చొరవ చూపాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వం మరో హామీలను కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది.

ఈనెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మరో రెండు పథకాలను అమలు చేయడానికి సిద్ధమయింది. ఈ విషయంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయా జిల్లాలలో జరిగిన సమీక్ష సమావేశాలలో వెల్లడించారు.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసే విషయంపై చర్చ జరిగింది. డిసెంబర్ 28వ తేదీ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి పింఛన్లను పెంచడంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అందజేయాలని ప్రక్రియను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

ఇందిరమ్మ చేయూత ద్వారా పింఛన్ 4000 రూపాయలను, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ ను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు