Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Egg : కొండెక్కిన కోడిగుడ్డు ధర..!

Egg : కొండెక్కిన కోడిగుడ్డు ధర..!

సామాన్యుని జేబుకు చిల్లు

పేదోడికి మాంసాహారమే’ గుడ్డు ’

గుడ్డు మాంసాహారం కాదు.. శాకాహారమే..

దుబ్బాక, మనసాక్షి :

నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేట్లు పెరిగి కాస్త తగ్గుతున్నాయనే సమయాని మరొకటి రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిగడ్డలు, టమాల ధరలు కొండెక్కగా.. ఆ తర్వాత చికెన్ రేట్లు అనంతరం వెల్లుల్లి.. ఇలా ఒక్కొక్కటిగా మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి.

ఇక.. ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది.షాపుల్లో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కార్తికమాసం ముగిసిన తర్వాత.. గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో.. ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 మాత్రమే ఉండగా.. వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.7 నుంచి 8 గా పలుకుతోంది.

ALSO READ : BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు చేరుకోవటం జరిగిందని విక్రయదారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉండగా.. రిటైల్‌లో రూ.7గా అమ్ముతున్నారు.కొన్ని కొన్ని దుకాణాల్లో రూ.7.50, రూ.8గా కూడా అమ్ముతుండటం గమనార్హం.

ప్రస్తుతం కేసు ధర రూ.180 నుంచి రూ.200 చేరడంతో రిటైల్‌ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు.మరోవైపు చికెన్‌ ధర కూడా పెరిగుతున్నాయి. కార్తిక మాసంలో కిలో చికెన్‌ రూ.170 నుంచి రూ.190 వరకు పెరుగుతున్న అమ్మకాలు తగ్గడం లేదు. తాజాగా రూ.240కి చేరటం గమనార్హం.

ALSO READ : Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!

మరిన్ని వార్తలు