Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Delivery Boys : పేరుకే డెలివరీ బాయ్స్.. వాళ్ళ డెలివరీ చేసేది చూస్తే షాక్..!

Delivery Boys : పేరుకే డెలివరీ బాయ్స్.. వాళ్ళ డెలివరీ చేసేది చూస్తే షాక్..!

శేరిలింగంపల్లి. మన సాక్షి :

డెలివరీ బాయ్ గా పనిచేస్తే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదనకు ఇద్దరు యువకులు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.

మారం పవన్ కుమార్ అలియాస్ పచ్చ పవన్, ఆదర్శ కుమార్ సింగ్ కొండాపూర్ లో ఉంటూ డెలివరీ బాయ్ లు పనిచేస్తున్నారు.అయితే ఈజీమనీ కోసం అలవాటు పడిన వీరిద్దరూ బెంగళూరు నుండి ఎండీఎంఏ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుండి గంజాయిని నగరానికి తీసుకువచ్చి ఇక్కడ యువతకు విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే విశ్వసనీయ సమాచారంతో వీరి కదలికలపై నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమయంలో నిందితులు పవన్ కుమార్, ఆదర్శ కుమార్ లను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే 21 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు.

ALSO READ  : రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాల వారికేనా. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దండగేనా..!

మరిన్ని వార్తలు