Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BREAKING : ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి.. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..!

BREAKING : ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి.. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..!

నల్లగొండ, మనసాక్షి :

పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎస్ ఎల్ బి సి కి నిధులు కేటాయించకుండా ఎమ్మార్పీ ఆధునికరించకుండా నల్లగొండ జిల్లా ఎండబెట్టి మళ్లీ ముసలి కన్నీరు కారుస్తూ నల్గొండకు రావడానికి సిగ్గుండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత నల్గొండకు రావాలని డిమాండ్ చేశారు.

తాము ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టామని విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వని రంగాలకు కూడా నిధులు కేటాయించామని తెలిపారు. కేసీఆర్ నల్లగొండకు వస్తున్న సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కుర్చీ వేసి గులాబీ కండువా పెట్టి ఆయన మాట్లాడిన మాటలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు తెలియపరుస్తామన్నారు.

ALSO READ : అక్కడ తెల్లవారుజామున 6 గంటల నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్..!

కేసీఆర్ గతంలో ఎస్ఎల్బీసీ వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న ఉపన్యాసాన్ని వినిపిస్తామన్నారు. కేసీఆర్ హరీష్ రావు తారకరామారావులకు మాట్లాడే అర్హత లేదన్నారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారని బడ్జెట్లో 13 శాతం అంటే 37 వేల కోట్ల రూపాయలు అప్పులకే పోతున్నాయని దుయ్యబట్టారు .

లక్ష కోట్లు పెట్టి పనికిరాని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని. రమేష్. పట్టణ పార్టీ అధ్యక్షుడు గుముల మోహన్ రెడ్డి .సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు