Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
మహారాజ్ పేటలో వ్యక్తి ఆత్మహత్య..!
మహారాజ్ పేటలో వ్యక్తి ఆత్మహత్య..!
శంకర్పల్లి: ఫిబ్రవరి 21: (మన సాక్షి):
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మండల పరిధిలోని మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (36) గత నాలుగు నెలలు నుండి కడుపు నొప్పితో బాధ పడుతూ ఇంట్లోనే ఉంటున్నాడని, ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడని పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై కోటేశ్వరరావు ఉన్నారు.
ALSO READ : చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!









