Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డి కి షాక్.. ఆ రోడ్డు తొలగించారు..!

Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డి కి షాక్.. ఆ రోడ్డు తొలగించారు..!

హైదరాబాద్ , మన సాక్షి :

మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మాణం చేసుకున్న రోడ్డును తొలగించారు. వివరాల ప్రకారం.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ అవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో 2500 గజాల భూమిని ఆక్రమించి గతంలో రోడ్డు నిర్మాణం చేశారు.

ఈ రోడ్డు ఆయన కాలేజీ కోసం వేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. రోడ్డు అంశం వచ్చింది. కాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శనివారం హెచ్ఎండిఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!

మరిన్ని వార్తలు