Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : అక్రమ డబ్బు, మద్యం, బంగారం రవాణా జరగకుండా చెక్ పోస్టుల ఏర్పాటు..!

Narayanpet : అక్రమ డబ్బు, మద్యం, బంగారం రవాణా జరగకుండా చెక్ పోస్టుల ఏర్పాటు..!

అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు స్థలాలను పరిశీలించిన కలెక్టర్లు, ఎస్పీ లు.

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రాబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ లు గురువారం కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కలెక్టర్ Dr. బి. సుశీల, జిల్లా ఎస్పీ జి. సంగీత లతో కలిసి సంయుక్తంగా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను, వాటికి అనువైన స్థలాలను పరిశీలించారు.

ముందుగా నారాయణపేట కలెక్టర్, ఎస్పీ లు నారాయణపేట మండలంలోని ఎక్లాస్ పూర్ చెక్ పోస్టు వద్దకు చేరుకోగా అక్కడికి కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా నుంచి గుర్మిట్ కల్ మీదుగా ఎక్లాస్ పూర్ చెక్ పోస్టు కు వచ్చిన యాదగిరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి నారాయణపేట కలెక్టర్, ఎస్పీలు అక్కడి చెక్ పోస్టుతో పాటు ఎర్ర గుట్ట చెక్ పోస్టును పరిశీలించారు.

అనంతరం నారాయణపేట మండలంలోని జిలాల్ పూర్ చెక్ పోస్టును, అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలో కడే చూర్, అదే సరి హద్దులో ఉన్న చెక్ పోస్ట్ ల స్థలాలను పరిశీలించారు. ఆ తర్వాత నారాయణ పేట జిల్లా పరిధిలోని చేగుంట, ఉజ్జెల్లి, కృష్ణ బ్రిడ్జి, పరిశీలించి త్వరలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం, బంగారం, ఇతర విలువైన వస్తువుల రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీ లు ఇరు రాష్ట్రాల పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

ALSO READ : Record break : గత రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..!

అలాగే చెక్ పోస్ట్ ల దగ్గర పోలీస్ తో పాటు ఇతర శాఖల అధికారులు అందుబాటులో ఉండి విస్తృతంగా తనిఖీలు చేయాలని చెప్పారు. చెక్ పోస్ట్ లలో ఉండే అధికారులు, సిబ్బందికి తగిన వసతి, సౌకర్యాలు కల్పించాలని అక్కడి అధికారులకు సూచించారు. చెక్ పోస్ట్ ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తనిఖీలు నిర్వహించే సమయంలో సీ సీ కెమెరాల ద్వారా రికార్డ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

త్వరలో ఇరు రాష్ట్రాల పరిధిలోని సరిహద్దుల్లో తమ తమ చెక్ పోస్ట్ లను పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో చెక్ పోస్టు లలో విధులు నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీ లు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డి.ఎస్.పి. నల్లపు లింగయ్య, యాద్గిరి డి.ఎస్.పి అరుణ్ కుమార్ కౌర్, , సిఐ లు రామ్ లాల్, భగవంత్ రెడ్డి, చంద్ర శేఖర్, ఎస్.ఐ.లు వెంకటేశ్వర్లు, నవీద్, భాగ్యలక్ష్మి రెడ్డి, నారాయణపేట, మాగనూరు తహాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మరిన్ని వార్తలు