Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

BREAKING : శివరాత్రి పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి..!

BREAKING : శివరాత్రి పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి..!

మన సాక్షి , నిజామాబాద్ :

శివరాత్రి పండుగ పూట విషాదం నెలకొన్నది. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామానికి చెందిన మారవీటి రవీందర్ (55) అతని కుమారుడు శివరాజ్ (24) శుక్రవారం బైక్ పై ఆర్మూర్ వెళ్తున్నారు.

మార్గమధ్యలో వేల్పూరు మండలం పడగల్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. రవీందర్ అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల అతని కొడుకు శివరాజ్ తండ్రిని ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తండ్రి, కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్ ఐ వినయ్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మరిన్ని వార్తలు