Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Nalgonda : పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ..!

Nalgonda : పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ..!

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన  ఆదేశం 

నల్లగొండ, మనసాక్షి:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, జిల్లా కలెక్టర్ దాసరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ సేంట్ ఆల్ఫాన్సెస్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ పరీక్షకు కేటాయించిన విద్యార్థులు ,హాజరైన వారు, గైర్ హాజరైన విధ్యార్ధుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్ బాలరాజుతో అడిగి తెలుసుకున్నారు.

కాగా ఈ పరీక్ష కేంద్రంలో ఏ,బి రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా, “ఏ” పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి 200 మంది విద్యార్థులను కేటాయించగా సోమవారం నాటి పరీక్షకు 199 మంది విద్యార్థులు హాజరయ్యారని ఒక్కరు మాత్రమే గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటిండెంట్ వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని, పోలీసు చెకింగ్ జాగ్రత్తగా చేయాలని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత కేంద్రంలోకి వదలాలని, ఇతరులు ఎవరని పరీక్ష కేంద్రంలో అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు .ఎవరైనా విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా వస్తున్నారా? అని జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతిని అడగగా, సకాలంలోనే విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు.

ALSO READ : Ed Office : ఈ డి ఆఫీస్ కు కేటీఆర్..!

పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 107 రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు, 2 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ,19302 మంది రెగ్యులర్ విద్యార్థులు, 413 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన కలెక్టర్ కు వివరించారు . అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆవరణలో ఉన్న గొల్లగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఈ పరీక్ష కేంద్రానికి 230 మంది విద్యార్థులను కేటాయించగా, 229 మంది హాజరు కాగా, ఒకరు మాత్రం గైర్హాజరైనట్టు ఆ పరీక్ష కేంద్రం సూపరింటిండెంట్ డి .చంద్ర నాయక్ జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఆవరణలో ఉన్న విద్యాశాఖ కు సంబంధించిన పలు భవనాలు, ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ డీఈవోతో అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులకు తావివ్వవద్దని, అన్ని కేంద్రాలలో అవసరమైన తాగునీరు, ప్రథమ చికిత్స వంటి ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలోకి ఎవరు సెల్ఫోన్లు తీసుకురావద్దని చెప్పారు. అలాగే పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని చెప్పారు .పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని ఆమె ఆదేశించారు.స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు