Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజాతీయంతెలంగాణ

IPL : ఉప్పల్ లో ఉప్పెన.. ఎస్ ఆర్ హెచ్ సరికొత్త రికార్డు..!

IPL : ఉప్పల్ లో ఉప్పెన.. ఎస్ ఆర్ హెచ్ సరికొత్త రికార్డు..!

ఐపీఎల్ చరిత్రలో ఆర్ సి బి రికార్డు బ్రేక్ చేసిన ఎస్ఆర్హెచ్

ఎస్ ఆర్ హెచ్ రన్స్ 20 ఓవర్లలో 277

ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులకు పరిమితమైన ముంబై ఇండియా

31 పరుగులతో ఎస్ ఆర్ హెచ్ విజయం

హైదరాబాద్ , మన సాక్షి :

ఐపిఎల్ క్రికెట్ లో ఎస్ ఆర్ హెచ్ టీం సునామి సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఎస్సార్ హెచ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆర్ సి బి పై ఉన్న రికార్డును ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేసింది బుధవారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఎస్సారెస్ వర్సెస్ ముంబై టీం మధ్య మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా ఎస్ ఆర్ హెచ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సునామి సృష్టించింది.

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు :

ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ సరికొత్త రికార్డును సృష్టించింది. గతంలో 2013లో ఆర్సిబి వర్సెస్ పంజాబ్ టీం తో ఆడిన సమయంలో ఆర్సిబి 263 పరుగులతో రికార్డు సృష్టించగా ప్రస్తుతం ఆర్సీబీ రికార్డును ఎస్ఆర్ హెచ్ బ్రేక్ చేసింది. ముంబై ఇండియా ముంగిట భారీ లక్ష్యం ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ముంబై ఇండియా టీం లో ఆటగాళ్లు అంతా రాణించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. దాంతో 31 పరుగులతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది.

కిటకిటలాడిన ఉప్పల్ స్టేడియం :

ఐపీఎల్ మ్యాచ్ బుధవారం ఎస్సారెస్ – ముంబై ఇండియా టీం కొనసాగుతుండగా ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానుల తో కిటకిటలాడింది. క్రికెట్ అభిమానులు 15 వేలకు పైగా చేరుకున్నారు. అభిమానుల సౌకర్యార్థం కోసం తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన 60 బస్సులను ఏర్పాటు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా బస్సులను ఉప్పల్ స్టేడియం వైపు తీసుకెళ్లగా మ్యాచ్ అయ్యాక కూడా వివిధ ప్రాంతాలకు ఉప్పల్ స్టేడియం నుంచి ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా వేసింది. దాంతో అభిమానులు ఉప్పల్ స్టేడియం కు భారీగా చేరారు.

ALSO READ : IPL : ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ సునామి.. సరికొత్త రికార్డు సృష్టించిన ఎస్ ఆర్ హెచ్..!

మరిన్ని వార్తలు