Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణరాజకీయం

BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం.. ఇది మూడోసారి..!

BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం.. ఇది మూడోసారి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఒక వాహనం టైర్ వెంచర్ అయింది. దాంతో వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టైర్ పేలడంతో పెద్ద శబ్దం రాగా.. ఏం జరిగిందో అని అందరూ భయాందోళనకు గురయ్యారు. వాహనం నుంచి అందరూ బయటికి వచ్చారు. పేలిన టైర్లు రిపేర్ చేయించి మళ్లీ వాహనాలు కొడంగల్ కు బయలుదేరారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మొయినాబాద్ మీదుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదాలు తప్పడం ఇది మూడోసారి.

మార్చిలోనే రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వెళుతున్న కాన్వాస్ లో ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొని ప్రమాదం సంభవించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం సంభవించలేదు.

అదేవిధంగా మార్చి 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో కూడా సాంకేతిక లోపం ఏర్పడటం తెలిసిన విషయమే. దానిని పసిగట్టిన పైలట్లు సకాలంలో ల్యాండింగ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ పెట్టించుకున్నారు. విమానంలో రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ దీపదాస్ ఉన్నారు. పైలట్ల చాకచక్యంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు