Fertilizers : ఎరువులు ఈ౼పాస్ యంత్రాల ద్వారానే విక్రయించాలి..!

ఫర్టిలైజర్ (ఎరువుల) దుకాణల తనిఖీలో భాగంగా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో గల శ్రీరామ ఫెర్టిలైజర్స్, మనీ ఫర్టిలైజర్స్, దివ్య ట్రేడర్స్, మన గ్రోమోర్ సెంటర్ మరియు రైతు సేవా సహకార సంఘం లలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రావణ్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది.

Fertilizers : ఎరువులు ఈ౼పాస్ యంత్రాల ద్వారానే విక్రయించాలి..!

ఎరువుల దుకాణాలలో తనిఖీలు

కొండ మల్లేపల్లి, మన సాక్షి:

ఫర్టిలైజర్ (ఎరువుల) దుకాణల తనిఖీలో భాగంగా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో గల శ్రీరామ ఫెర్టిలైజర్స్, మనీ ఫర్టిలైజర్స్, దివ్య ట్రేడర్స్, మన గ్రోమోర్ సెంటర్ మరియు రైతు సేవా సహకార సంఘం లలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రావణ్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది.

ఈ తనిఖీలో ఈ౼పాస్ యంత్రములు గల ఎరువుల నిల్వల వివరాలు గోదాములో ఉన్న ఎరువుల నిల్వల వివరాలతో తనిఖీ చేయడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆధార్‌ నమోదు చేయకుండా ఎరువుల అమ్మకాలు చేపట్టొద్దని ఆదేశించారు. రైతులకు ఎరువులను ఈ౼పాస్ యంత్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని,

రానున్న ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు మరియు విత్తనాలు అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. అదేవిధంగా దుకాణాల ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వెంట ఏడిఏ ఆర్ శ్రీలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి ఎస్ వెంకన్న ఉన్నారు.

ALSO READ : Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!