Congress Party : ఉపాధి హామీ.. కాంగ్రెస్ ఘనత..!
Congress Party : ఉపాధి హామీ.. కాంగ్రెస్ ఘనత..!
అర్వపల్లి, మన సాక్షి
భారతదేశంలో ఉపాధి హామీ పనులను, కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేల్పుల రమేష్ ముదిరాజ్ అన్నారు.
బుధవారం పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ ఉపాధి హామీ కూలీలను కలుసుకొని మాట్లాడారు.
భారతదేశంలో ఉపాధి హామీ కూలితోపాటు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు. ఈరోజు భారత దేశ చరిత్రలో ఉన్న ప్రాజెక్టులు గానీ, హైదరాబాదులోని మెట్రో రైల్ తో పాటు భారతదేశంలో ఉన్న అన్ని మెట్రో రైలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోనే నిర్మించినట్లు తెలిపారు.
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా తుంగతుర్తి నియోజకవర్గం సొంత ముద్దుబిడ్డ పేదల పెన్నిధి కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు.
ఉపాధి హామీల తోపాటు అనేక అక్షర కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, కరెంట్ బిల్లు మాఫీ, గ్యాస్ సిలిండర్ 500 ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రతి మహిళలకు 2500 ఇస్తుందని రూపాయలు అన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ఉపాధి కూలీలు సంతోషo వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రాంబాబు ముదిరాజ్, సాయిని మనోహర్ ముదిరాజ్, బైరబోయిన మహారాజ్, కృష్ణమూర్తి, అశోక్, మల్లయ్య, బుచ్చిబాబు, రవీందర్, శ్రీకాంత్, సతీష్, సాయిని వీరస్వామి, శేఖర్, షాబుద్దీన్, మహిళా నాయకురాలు, స్వరాజ్యం, మంగమ్మ, పద్మ, ఉపేంద్ర, పాల్గొన్నారు.
ALSO READ :
Hyderabad : హైదరాబాదులో ఘోరం.. గోడ కూలి ఏడుగురు మృతి..!
Chiranjeevi : ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఏమన్నారు.. వైరల్ గా మారిన కామెంట్స్.. (వీడియో)
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?
KomatiReddy : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది..!









