Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్సినిమా

Chiranjeevi : ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఏమన్నారు.. వైరల్ గా మారిన కామెంట్స్.. (వీడియో)

Chiranjeevi : ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఏమన్నారు.. వైరల్ గా మారిన కామెంట్స్.. (వీడియో)

మన సాక్షి వెబ్ డిస్క్

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార వైకాపా పై తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల కూటమి దాడి చేస్తుంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కూటమి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా తిరిగి మరోసారి అధికారం చేపట్టాలని వైకాపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీగా బహిరంగ సభలు, ర్యాలీల ప్రచారం సాగుతోంది.

 

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ చిరంజీవి ఆ వీడియోను విడుదల చేశారు. వీడియోలో మెగాస్టార్ ఎన్నో అంశాలను ప్రస్తావించారు. వాటిలో కళ్యాణ్ బాబు సినిమాలోకి కష్టంతో వచ్చాడని, రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడని పేర్కొన్నారు.

 

ALSO READ : Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

 

కళ్యాణ్ బాబు అందరివాడేలా అమ్మ కడుపులో పుట్టినా.. అందరికోసం ఆలోచిస్తాడని చిరంజీవి వీడియోలో పేర్కొన్నారు. తాను అందరికీ మంచి చేయాలని ఆలోచన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఉండేదని, రైతులను ఆదుకోవడంతోపాటు జవాన్లకు సహాయం చేస్తుంటాడని ఇలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే మరింత మేలు చేస్తాడని నమ్మకం ఉన్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు. జనసేనాని చట్టసభలలో కి పంపితే ప్రజలకు మేలు జరుగుతుందని పిఠాపురం ప్రజలు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కళ్యాణ్ బాబు ను చట్టసభలకు పంపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

వైరల్ గా మారిన చిరంజీవి వీడియో :

 

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు కళ్యాణ్ బాబు ను గెలిపించాలని కోరుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు కేవలం కళ్యాణ్ బాబు మాత్రమే కాకుండా చిరంజీవి వీడియో కూటమికి కూడా మేలు చేసే విధంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

 

 

మరిన్ని వార్తలు