Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం..!

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం..!

జిల్లా నాయకులు మాస భాస్కర్

చింతపల్లి, మన సాక్షి:

ప్రజా సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుమాస భాస్కర్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్, గొడకొండ్ల గ్రామంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఆస్తం గుర్తుపై ఓటు వేయాలని మహిళలను అభ్యర్థిస్తున్నారు.

దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎంపిగా రఘువీర్ రెడ్డి అన్నను చింతపల్లి మండలం నుండి పదివేల కు పైగా మెజార్టీఅందించాలన్నారు. ఇండియా కూటమేనని ప్రధానిగా యువ నాయకులు రాహుల్ గాంధీకావడం ఖాయమన్నారు. ప్రజాసంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాలు ప్రతి ఒక్క నిరుపేదకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

దేవరకొండ నియోజకవర్గం సాగునీటితో సస్యశ్యామలం కావాలంటే పెద్దలు జానారెడ్డి, కుమారుడు ఎంపీగా రఘువీర్ రెడ్డి అన్నను గెలిపించుకోని సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ఈ నెల 13న జరిగే ఓటింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని ఎంపీ రఘుర్ రెడ్డికి అతిపెద్ద మెజార్టీ అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, అంగిరేకుల శ్రీకాంత్,మండల ఓ బీసీ సెల్ నాయకులు ముడిగ మల్లేష్ యాదవ్,బెదరకోట భాస్కర్,జంగయ్య, ఏం డి ఖలీల్, చంటి శేఖర్, వీరమల్ల శ్రీను రామిన్ నగేష్, ఎండి నయుం, తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

ALSO READ : 

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

Devarakonda : కారు దిగి కాంగ్రెస్ గూటికి.. కుర్మేడ్ లో బిఆర్ఎస్ ఖాళీ..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు