Devarakonda : కారు దిగి కాంగ్రెస్ గూటికి.. కుర్మేడ్ లో బిఆర్ఎస్ ఖాళీ..!

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ చింతపల్లి మండలం పిఎసిఎస్ డైరెక్టర్ అండేకర్ అశోక్ ఆ పార్టీకి రాజీనామా చేసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Devarakonda : కారు దిగి కాంగ్రెస్ గూటికి.. కుర్మేడ్ లో బిఆర్ఎస్ ఖాళీ..!

చింతపల్లి, మన సాక్షి :

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ చింతపల్లి మండలం పిఎసిఎస్ డైరెక్టర్ అండేకర్ అశోక్ ఆ పార్టీకి రాజీనామా చేసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ మండల బీసీ సెల్ నాయకులు అండేకర్ అశోక్ తో పాటు మరో 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే బాలు నాయక్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువను కప్పి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేపాలన కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని , కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమేనని వారు పేర్కొన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పోయిందని, వేలాదిమంది విద్యార్థుల బలిదానాలతో అధికారం చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకొండ నియోజకవర్గం పై చిన్న చూపు చూశారని వారు ఆవేద వ్యక్తపరిచారు. 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధులు దారి మళ్లించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం నిధులు దుర్వినియోగం చేశారన్నారు.

ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దేవరకొండ నియోజకవర్గ గిరిజన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి సాగు నీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గానికి మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో చర్చించి ఎస్ ఎల్ బి సికి నిధులు వెచ్చించడం జరిగినది అన్నారు. నీళ్లు నిధులు, నియామకలతో ఏర్పడిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గం పై చిన్న చూపు చూసిందన్నారు.

 

ALSO READ : WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

 

అందుకే దేవరకొండ నియోజకవర్గం ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. ప్రజా తీర్పును ఎవరు ఆపలేరని, అందుకోసం ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి అన్నకు అత్యధిక మెజార్టీ అందించి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రశ్నించాలన్నారు. తన గెలుపుకు చింతపల్లి మండలం నుండి ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా అంతకంటే రెండింతలు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అన్నకు అత్యధిక మెజార్టీని అందించి నల్లగొండ జిల్లాను దేశ చరిత్రలో నిలిపే విధంగా ప్రతి ఒక్కరు కృషి అన్నారు.

తాను అందరి సహకారంతో దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క నాయకుని కార్యకర్త సూచనలతో మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. దేవరకొండ ప్రాంతానికి సాగునీరు అందించడమే నా ముఖ్య లక్ష్యం అన్నారు. ఎంపీగా కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేగా తాను మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయడమే మా జీవిత లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఉప్పు శ్రీశైలం, కురుమేడు మాజీ సర్పంచ్ కురుమేటి బజార్ పాల్గొన్నారు.

ALSO READ : 

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!