Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంవ్యవసాయం

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీని చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం విధితమే. కాగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సందర్భంలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. రైతుల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందువల్ల రైతు రుణమాఫీ కి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులను కూడా ఆదేశించారు.

దాంతో అధికారులు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేశారు. ఇక కేవలం దానిని అమలు చేయడమే తరువాయిగా మిగిలింది. రైతులందరికీ ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 18వ తేదీన మంత్రిమండలి సమావేశం కూడా నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రైతు రుణమాఫీ అమలులకు విధివిధానాలను అధికారికంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు రాబోయే ఐదేళ్లకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండే విధంగా మంత్రి వర్గంలో చర్చించనున్నారు.

రైతు రుణమాఫీ కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది పూర్తి వివరాలను కూడా అధికారులు సేకరించారు. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతుల రుణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్యాంకర్లు, అధికారులు సేకరించారు.

బ్యాంకర్లు ఇచ్చిన డేటా ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు ఇప్పటికే నివేదిక అందించినట్లు సమాచారం. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నెల 18వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింపజేయగా ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు తీసుకురానున్నారనే అంశంపై సర్వత్ర చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారా..? లేదా..? అనేది కూడా రైతుల్లో చర్చ కొనసాగుతుంది. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకోలేదు.. మరి వారికి మాఫీ వర్తిస్తుందా..? లేదా..? అన్నది కూడా తెలియాల్సి ఉంది.

బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు సంప్రదింపులు ఇప్పటికే జరిపినట్లు సమాచారం. రుణమాఫీ అమల్లో ఎక్కువమందికి లబ్ధి జరిగేలా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ విధివిధానాలపై సర్వత్ర చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనా ఈనెల 18వ తేదీన రుణమాఫీ పై పూర్తిస్థాయి నివేదిక ప్రకటించే అవకాశం ఉంది.

ALSO READ : 

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

IND vs PAK. : ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పాక్ పై భారత్ ఘన విజయం..!

ముగిసిన రామోజీ అంత్యక్రియలు.. పాడెపట్టిన చంద్రబాబు..!

Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు