Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : సమన్వయంతో పనిచేసి జిల్లాని అభివృద్ధి బాటలో నిలుపుదాం.. బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..!

BREAKING : సమన్వయంతో పనిచేసి జిల్లాని అభివృద్ధి బాటలో నిలుపుదాం.. బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లాకు ఏడవ కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవర్ పదవి బాధ్యతలు స్వికరించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 ని॥ల కు నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. తేజస్ నందలాల్ పవర్. కలెక్టరేట్ లోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్కు పుష్పగిచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.

2018 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కలెక్టర్ తేజ సునందలాల్ పవర్ స్వస్థలం బీహార్ జిల్లాకు చెందినవారు. మహబూభునగర్ లో అసిస్టెంట్ కలెక్టర్గా, అదనపు కలెక్టర్ గా పని చేశారు. కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి,

బదిలీపై సూర్యపేట కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత , ఏ ఓ సుదర్శన్‌ రెడ్డి ఆన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ALSO READ : 

BREAKING : నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

మరిన్ని వార్తలు