Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంసంక్షేమం

Cm Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు వారికి మాత్రమే.. రేవంత్ రెడ్డి నిర్ణయం..!

Cm Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు వారికి మాత్రమే.. రేవంత్ రెడ్డి నిర్ణయం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి 11వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకుగాను లబ్ధిదారుల ఎంపికకు కూడా ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరించారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు పూర్తిస్థాయి కసరత్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మహిళల పేరు మీదనే మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా వారికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, సొంత జాగా ఉండి ఖాళీగా ఉన్నట్లయితే నిర్మాణం చేపట్టుకునే వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మోడల్ ను కూడా ఆయన గతంలోనే విడుదల చేశారు. ఇంటి నిర్మాణం కూడా అదే మోడల్ నిర్మించుకోవాల్సి ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం 82.82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కాగా మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు.

కాగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గాను డ్రా సిస్టం పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది పలు రాష్ట్రాలలో అధ్యయనం చేసిన తర్వాతనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

ALSO READ : 

BRS : గులాబి బాస్ స్థానం ఆతడిదేనా.. పార్టీలో అంతర్మథనం..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Jagan : ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. అడగకపోతే చంద్రబాబు చేసిన మరో పాపం..!

మరిన్ని వార్తలు