Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యసంగారెడ్డి జిల్లా

TG NEWS : బీఆర్ఎస్ హయాంలో.. ఆర్భాటంగా ఆరంభం, ప్రారంభమే లేదు..! 

TG NEWS : బీఆర్ఎస్ హయాంలో.. ఆర్భాటంగా ఆరంభం, ప్రారంభమే లేదు..! 

కంగ్టి, మన సాక్షి

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే నిధుల లేమి కారణంగా పనులు ఆసంపూర్తిగా ఉండి నిలిచిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జడ్పిహెచ్ఎస్ పారశాల భవనం శిథిలావస్థకు చేరడంతో మన ఊరు – మనబడి కింద ఆదనపు గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్ల బ్లాకునకు సంవత్సరం కిందట రూ. కోటి 5 లక్షలు కేటాయించింది కానీ నిధులు మాత్రం అంతంత మాత్రమే విడుదల చేసింది దాంానితో గుత్తేదారు సగం వరకు పనులు చే చేశారు.

అదనపు గదుల్లో భాగంగా స్లాబ్ వేసి అంతటితో వదిలేశారు.చేసిన పనులకు బిల్లలు రాకపోవడంతో మూత్రశాలలు, మరుగుదొడ్డ బ్లాకు పనులను ప్రారంభించలేదు. ఆదనపు గదుల పనులను అర్ధాంతరంగా వదిలేశారు.తడ్కల్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల గదుల నిర్మాణ పనులను అర్ధాంతరంగా వదిలేశారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

ఈ విషయమై పీఆర్‌ ఏఈ మాధవ నాయుడు ను ” మనసాక్షి ” వివరణ కోరగా… నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు. బిల్లులు రాక గుత్తే దారు పనులు నిలిపివేశాడని, నిధులు రాగానే మిగతా పనులు చేయిస్తామన్నారు.

ALSO READ : 

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!

మరిన్ని వార్తలు