Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

NALGONDA : ప్రజావాణి ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం..! 

NALGONDA : ప్రజావాణి ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం..! 

చింతపల్లి, మన సాక్షి:

ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతున్న ప్రజా వాణి కార్యక్రమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని చింతపల్లి మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోజిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజావాణి కార్యకమ కౌంటరను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో నిరుపేదలకు అర్హులైన వారి నుండి దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని వారిలో నిజమైన లబ్ధిదారుడు నష్టపోకుండా ఉండే అందుకే ఈ ప్రజావాణి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.

అందుకోసం గ్యాస్ కనెక్షన్లు, వృద్ధాప్యం పింఛన్, విడో పింఛన్, వికలాంగుల పింఛన్, అక్షర జ్యోతి దీపం పథకం, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, తదితర విషయాలపై నిరుపేదలు అందించే వినతులను సేకరించి ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

సమస్యలు ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు స్వీకరించిన వినతులపై ప్రతివారం జిల్లా కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, ఎంపీడీవో సుజాత, తాసిల్దార్ విజయకుమార్, జెడ్పిటిసి కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి ఆర్డీవో, స్పెషల్ అధికారిని పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు