Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్ఐ..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్ఐ..!

ManaSakshi :

నాగర్కర్నూల్ జిల్లాలోని వెల్దండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రవికుమార్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా ఏసీబీకి సమాచారం అందింది. దీంతో మాటువేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐ రవికుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్ కథనం ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని తిలక్నగర్ చెందిన డేరంగుల వెంకటేశ్ అనే వ్యక్తి ఇంటిపై ఈనెల 17న వెల్దండ పోలీసులు దాడి చేశారు. అతడి ఇంట్లో రాళ్లు పగులగొట్టేందుకు వినియోగించే మందుగుండు సామగ్రి కలిగిన 7 పెట్టెల జిలిటెన్ స్టిక్స్, 2 పెట్టెల డిటోనేటర్లను నిల్వ చేసినట్లు వెల్దండ పోలీసులు గుర్తించారు.

ఈ విషయంలో అతడిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై రవికుమార్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు వెంకటేశ్ జూన్ 19న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ALSO READ : 

Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

మరిన్ని వార్తలు