Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

SLBC : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సొరంగం శ్రీశైలం.. నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..! 

SLBC : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సొరంగం శ్రీశైలం.. నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..! 

దేవరకొండ, మనసాక్షి :

ఎస్ ఎల్ బి సి ఏ ఎమ్ ఆర్ పి ఒకటవ టన్నెల్ ఔట్లెట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలిసి ఎస్ఎల్బీసీ ఏఎమ్ఆర్పి ఒకటవ టన్నెల్ ఔట్ లెట్ ను సందర్శించారు.

ముందుగా జిల్లా కలెక్టర్ టన్నెల్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రాజక్ట్ నిర్మాణం చేపట్టిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో టన్నేల్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కు ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పి టన్నెల్ వన్ ఔట్లైట్ పథకంపై వివరిస్తూ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఐదవ పొడవైన టన్నెల్ అని, 10 మీటర్ల డయాతో చేపట్టిన ఈ టన్నెల్ మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు ఉందని తెలిపారు.

ఈ టన్నెల్ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లే సామర్థ్యంతో డిజైన్ చేయడం జరిగిందని, గరిష్టంగా 5570క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఈ టన్నెల్ కు ఉంటుందని, శ్రీశైలం ప్రాజెక్టు ఎడమకాలువ ద్వారా 1925 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టన్నెల్ నిర్మాణం చేపట్టగా,సవరించిన అంచనాల ప్రకారం ప్రాజక్ట్ 4658.59 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు.

శ్రీశైలం సొరంగ నిర్మాణ పనులపై సమీక్ష

టన్నెల్ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణాలను ఆయన జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ రాష్ట్ర విభజన, కరోనా తదితర కారణాలవల్ల టన్నెల్ నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టన్నెల్ సామర్థ్యం, టన్నెల్ డయా తదితర సాంకేతిక అంశాలను జిల్లా కలెక్టర్ , ఎస్ పి కి వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్న మన్నెవారి పల్లి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఒకటవ ఔట్ లెట్ ను సందర్శించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని, అందువలన త్వరితగతన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు, జయప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులతో కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్( నక్కలగండి ప్రాజెక్టు)ను సందర్శించారు.

దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, టన్నెల్ ఏజిక్యూటివ్ ఇంజనీర్ జి జె వి సత్యనారాయణ, డి ఈ చక్రపాణి, లలిత, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, రవిరాజ్ తో పాటు ,జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ ప్రాజెక్టు ఏజెన్సీ ఏజీఎంలు దీపక్ జైన్, వీరేందర్ సింగ్, చందంపేట తహసిల్దార్ శ్రీనివాస్, చందంపేట ఎంపీపీ పార్వతి తదితరులు ఉన్నారు.

ALSO READ : 

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

మరిన్ని వార్తలు