Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యసంగారెడ్డి జిల్లా

Basara : చదువులలో కూలి బిడ్డ టాప్, బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక..!

Basara : చదువులలో కూలి బిడ్డ టాప్, బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక..!

కంగ్టి, మన సాక్షి :
బాసర త్రిబుల్ ఐటీ కి కూలి బిడ్డ ఎంపికయింది. కష్టపడితే కానీ కడుపునిండని కూలి బతుకులు.. బిడ్డని ఉన్నత స్థాయిలో చూడాలని చదివించారు. తల్లిదండ్రుల ఆశలు వమ్ము కాకుండా ఆ బిడ్డ పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి త్రిబుల్ ఐటీ లో సీటు సాధించింది. వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన చాకలి అంబయ్య , సునీత దంపతుల కుమార్తె కీర్తన. తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాకలి కీర్తన చదివింది. పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. కీర్తన తల్లిదండ్రులు ప్రతిరోజు కూలీ పనులకు వెళ్తూ కష్టపడి కూతురుని చదివించుకున్నారు.

తమ కూతురుకు త్రిబుల్ ఐటీ లో సీటు రావడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయులు రహీముద్దీన్ , ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలే తమని ఈ స్థాయికి ఎదిగేలా చేశాయని బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి చాకలి కీర్తన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ : 

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

మరిన్ని వార్తలు