Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : సినీ ఫక్కీలో చేజింగ్.. నార్కట్ పల్లి నుంచి దొంగలను వెంబడించిన పోలీసులు,.!

BREAKING : సినీ ఫక్కీలో చేజింగ్.. నార్కట్ పల్లి నుంచి దొంగలను వెంబడించిన పోలీసులు,.!

నల్లగొండ , మన సాక్షి;

సినిమా ఫక్కీ లో చేజింగ్ జరిగింది పోలీసులు దొంగలను వెంబడించి మరి పట్టుకున్న సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. గత కొంతకాలం నుండి నల్లగొండ జిల్లాలోని చిట్యాల నార్కట్పల్లి కట్టంగూర్ రాచకొండ సైబరాబాద్ ప్రాంతాలతో పాటు సంగారెడ్డి జిల్లా నేషనల్ హైవే 65 పై రోడ్డు సైడ్ వాహనాలను ఆపి అందులో పడుకున్న యాజమాన్యులను రాళ్లతో కొట్టి హత్య చేస్తారు.

వారి వద్ద నుండి బంగారం డబ్బులు దొంగలిస్తూ అదే క్రమంలో కట్టంగూర్ పీఎస్ పరిధిలో టాటా మినీ గూడ్స్ వాహనంలో పడుకున్న కొల్లూరు రాజా వర్ధన్ అనే వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి స్క్రూ డ్రైవర్తో అతని హత్య చేసి అతని వద్దనున్న 14,500 రూపాయలు దొంగలించుకుని పారిపోయి దారిలో గ్రామంలో ఒక హోండా షైన్ ను దొంగలించుకొని అలాగే ఇంటి ఆరు బయట పండుకున్న వారి మెడలో నుండి బంగారం ఆభరణాలు బైకులు దొంగలించుకుంటూ సీరియల్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ గా మారిన అతి క్రూరమైన నలుగురు పార్థి గ్యాంగ్ సభ్యులు గల ముఠాలో ఇద్దరినీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పై అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు .

శనివారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్ర లోని పూనా జిల్లా ఇందాపూర్ గ్రామానికి చెందిన అప్ప పాండురామ్. అహ్మదా నగర్ జిల్లా దుదోవడి గ్రామానికి చెందిన శుభం అశోక్ .పూణే జిల్లా సరస్వతి నగర్ కి చెందిన కాశ్మీర్ శశిపాల్ .అలాగే సరస్వతి నగర్ చెందిన అదేష్ అనిల్ అనే నలుగురు ముఠా సభ్యులు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

వీరంతా ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలోని చిట్యాల నార్కట్పల్లి కట్టంగూరు మండలాలు రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ లలో అలాగే సంగారెడ్డి జిల్లాలో వాహనాలను రోడ్డుపై సైడ్ కాపీ అందులో పడుకున్న వారిని రాళ్లతో కొట్టి చంపి వారి వద్ద నుండి నగదు బంగారం దొంగిలించకపోతున్నారని తెలిపారు

వీరిని ఈనెల 5వ తేదీన పసిగట్టిన నల్లగొండ పోలీసులు వారిని వెంబడించే సమయంలో పోలీస్ వారిని చూసి పార్తీ గ్యాంగ్ చెందిన ఇద్దరు దొంగలు ఒక టాటా ఏస్ లో వాహన మూ,ఎక్కి పరారవుతుండగా సుమారు 9 గంటల సమయంలో హయత్ నగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గల సంపూర్ణ హోటల్ ఎదురుగా గల ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వద్ద వాహనాన్ని ఆపి దిగి పారిపోవుచుండగా పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులపై వారు కత్తర్లతో స్క్రూ డ్రైవర్ తో పుడిచి చంపే ప్రయత్నం చేస్తుండగా రక్షణ కోసం గాలిలో పోలీసులు కాల్పులు జరిపి వారిద్దరిని చాకచక్యం పట్టుకొని అక్కడి నుండి నల్గొండ జిల్లా కేంద్రం తీసుకు వచ్చినట్లు తెలిపారు.

ఈ సంఘటనలో కానిస్టేబుల్ విక్రమ్ శంకర్ మణికట్టుకు గాయమైందని ఉంగరం వేలు పెరిగిందని ఎస్పీ తెలిపారు. వీరంతా వివిధ ప్రాంతాలలో 32 కేసులలో నేరస్తులని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేదించిన నల్గొండ డిఎస్పి శివరామిరెడ్డి సిఐ నాగరాజు నార్కెట్పల్లి సిఐ సైదాబాబు చిట్యాల ఎస్ఐ విష్ణువర్ధనగిరి కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.

ALSO READ : 

Miryalaguda : మీకు తోడుగా నేనుంటా కానీ.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వారికి డెడ్ లైన్..!

KCR : హలో.. ఫామ్ హౌస్ కు రండి, డైలమాలో గులాబి దళపతి..!

మరిన్ని వార్తలు