Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!
Miryalaguda : మిర్యాలగూడలో భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలో భారీగా పిడిఎస్ బియ్యం ను పోలీసులు పట్టుకున్నారు. డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం షాబ్ నగర్ కు చెందిన అవదారపు రాము ఇంటిలో వన్ టౌన్ పోలీసులు తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉన్న 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుబడినట్లు తెలిపారు. ఆ బియ్యంలో సీజ్ చేసి పంచనామ జరిపి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ :
BREAKING: అక్రమంగా తరలిస్తున్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!









