Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : విశాఖ ఎక్స్ ప్రెస్ లో దారుణం.. యువతిపై లైంగిక దాడికి యత్నం, రైలు లోంచి తోసేసిన యువకుడు..!

Miryalaguda : విశాఖ ఎక్స్ ప్రెస్ లో దారుణం.. యువతిపై లైంగిక దాడికి యత్నం, రైలు లోంచి తోసేసిన యువకుడు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రైల్వే ప్రయాణికులకు భద్రత కరువైంది. ప్రయాణికుల సామాగ్రి చోరీ జరగటం సహజంగా మారింది. అంతేకాకుండా మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలకు కూడా జరుగుతున్నాయి. విశాఖ ఎక్స్ ప్రెస్ లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. విశాఖ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న యువతిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

యువతి పై అఘాయిత్యానికి ప్రయత్నించిన దుండగుడు, ఆమె ప్రతిఘటించడంతో, కిందికి తోసి వేసేందుకు ప్రయత్నిస్తూ, తాను కింద పడిపోవడంతో ఇరువురు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం రాత్రి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంక్ తండా సమీపంలో చోటుచేసుకుంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలంకు చెందిన యువతి విశాఖ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ కు బయలుదేరింది. అదే రైల్లో ఒరిస్సా రాష్ట్రం, మల్కనగిరి జిల్లా, మలవరానికి చెందిన నట్టు బిస్వాస్ అనే యువకుడు ప్రయాణిస్తూ, యువతిని వేధింపుకు పాల్పడ్డాడని తెలిపింది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువతి వాష్ రూమ్ వెళ్లడంతో అదే అదునుగా భావించిన యువకుడు సదరు

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అగాయిత్యానికి పాల్పడడంతో, యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో, ఆమెను కిందికి తోసి వేసేందుకు ప్రయత్నించాడని, ఆమె అతడి చేతిని గట్టిగా పట్టుకోవడంతో, ఆమెతో పాటు యువకుడు కూడా కిందపడి గాయాల పాలయ్యాడు.

గాయాలైనప్పటికీ సదరు యువతీ సమీప గ్రామంకు చేరుకోవటంతో మాజీ సర్పంచ్ రాంచంద్రు స్పందించి యువతిని చికిత్స కోసం మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన సమాచారంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ALSO READ : 

Power Bill : కరెంటు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. విద్యుత్ బిల్లులపై కీలక అప్ డేట్.!

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

మరిన్ని వార్తలు