Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Ration Shops : మిర్యాలగూడలో రేషన్ దుకాణాల ఆకస్మిక తనిఖీ.. డీలర్ పై కేసు నమోదు..!

Ration Shops : మిర్యాలగూడలో రేషన్ దుకాణాల ఆకస్మిక తనిఖీ.. డీలర్ పై కేసు నమోదు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు. గురువారం పట్టణంలోని బియ్యం సరఫరా చేసే ఎం ఎల్ ఎస్ పాయింట్ ను, పలు రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్ నెంబర్ 17 లో బియ్యం నిల్వలు 10 క్వింటాళ్ల తక్కువగా తేడా ఉండటంతో డీలర్ నిర్మల పై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లు రేషన్ బియ్యం పై అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కార్డు దారులు రేషన్ బియ్యం డీలర్కు, ఇతరులకు విక్రయిస్తే రేషన్ కార్డులను రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం నాగేశ్వరరావు, సివిల్ సప్లై డిటిలు జావిద్,జ్యోతి, లింగుస్వామి, ఆర్ ఐ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)

BREAKING : ఉపాధ్యాయురాలుగా మారిన జిల్లా కలెక్టర్.. ఎందుకు అలా, తెలుసుకోవాలని ఉందా..! 

మరిన్ని వార్తలు