Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

KTR : ఆసరా పెన్షన్ దారులకు నోటీసులు.. సొమ్ము వెనక్కు లాక్కునే ప్రయత్నం, కేటీఆర్ సంచలన ట్వీట్..!

KTR : ఆసరా పెన్షన్ దారులకు నోటీసులు.. సొమ్ము వెనక్కు లాక్కునే ప్రయత్నం, కేటీఆర్ సంచలన ట్వీట్..!

ఆసరా పెన్షన్ల దారులకు ప్రభుత్వ నోటీసులు జారీ చేస్తుంది. వారికి ఇచ్చిన సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నం చేయడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం అంటూ కేసిఆర్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ALSO READ TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది!

కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.

ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం.

వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి! లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారు!

 

 

మరిన్ని వార్తలు